“అనసూయని ‘ఆంటీ’ అని పిలవడానికి కారణం ఆ రెండే” .. పచ్చిగా ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా చెప్పేసిన నటి కస్తూరి..!!

ప్రజెంట్ ఆంటీ అన్న పేరు వింటే అందరికీ అనసూయనే గుర్తొస్తుంది . ఆ ఆంటీ కి చరిత్ర పెద్దదే ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాంకర్ అనసూయను ఆంటీ అంటూ కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. ఆ వివాదం మనందరికీ తెలిసిందే. ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ కావాలని అనసూయను గట్టిగా పగ పట్టి ఆంటీ అంటూ పదే పదే ఆమెను వల్గర్ గా కామెంట్ చేసిన తీరు అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. ఇప్పుడిప్పుడే ఈ వివాదం సర్దుమనుగుతుంది అనుకుంటున్న టైంలో పలువురు స్టార్స్ పరోక్షకంగా అనసూయని కామెంట్ చేస్తూ ఆంటీ అంటూ పలు ఈవెంట్స్ లో వెక్కిరిస్తున్నారు .

మొన్నటికి మొన్న బ్రహ్మాజీ యాంకర్ సుమను “ఏంటి ఆంటీ?” అంటూ స్టేజిపైనే పరోక్షంగా అనసూయకు కౌంటర్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నటి కస్తూరి ఇదే విషయాలపై స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది .నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన కస్తూరి.. ప్రజెంట్ మాటీవీలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది .పలు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్న గృహలక్ష్మి.. రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ ఆంటీ వివాదం పై స్పందించింది. యాంకర్ కస్తూరిని ప్రశ్నిస్తూ ..”మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది ..? మీరు హర్ట్ అవుతారా..?” అని అడిగారు .

ఈ క్రమంలోనే కస్తూరి చాలా బోల్డ్ గా స్పందించింది . “మనల్ని ఎవరైనా ఆంటి అని పిలిస్తే..వాళ్ల ఏజ్ గమనించాలి . చిన్నపిల్లలు ఆంటీ అని పిలిస్తే ఒకలా ఉంటుంది . పెద్దవాళ్ళు ఆంటీ అని పిలిస్తే మరోలా ఉంటుంది . మనం అంత ఏజ్ వాళ్లు మనల్ని ఆంటీ అని పిలిస్తే ఎవరికైనా ఒళ్ళు మండదా..? ఒక మహిళను ఆంటీ అని పిలవడం సరైన పద్ధతి కాదు . దానికి సరైన సందర్భం ఉండాలి. ఓ నటుడినో లేదా హీరోను వెళ్లి అంకుల్ అని పిలవగలరా..? ఇండస్ట్రీలో ఎంతోమంది వయసు అయిపోయిన స్టార్ హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు ..దమ్ముంటే వాళ్ళని వెళ్లి అంకుల్ అని పిలవగలరా..? అంటూ సూటిగా ప్రశ్నించింది.

అంతేకాదు అనసూయ కన్నా వయసులో రెట్టింపు ఏజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు ..వెళ్లి వాళ్ళని అంకుల్ అని పిలవండి .. నాన్సెన్స్ ఏంటి ప్రతిసారి ఆంటీ ఆంటీ అంటూ టార్గెట్ చేసి ఏడిపించడం ..అనసూయని ఆంటీ అని పిలవడానికి రెండే రెండు కారణాలు వారి మైండ్లో డర్ట్ ధాట్స్ ఉండాలి .. లేదా వాళ్ళు కావాలని అవమానించే విధంగా ఆమెను పిలుస్తూ ఉండాలి. కచ్చితంగా ఈ విషయంలో నా సపోర్ట్ అనసూయకే ఉంటుంది “అంటూ బోల్డ్గా స్పందించింది . దీంతో మరోసారి అనసూయ ఆంటీ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

 

 

 

Share post:

Latest