టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగు ఏళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
అయితే విడాకుల అనంతరం తొలిసారి సమంతతో కలిసి ఉన్న ఫోటోను చైతు పోస్ట్ చేయడం ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు.. సమంత నాగచైతన్య ప్రేమకు పునాది వేసిన చిత్రం `ఏం మాయ చేసావే`. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 13 ఏళ్లు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ సినిమా 2010 ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ సినిమాలో నాగచైతన్య సమంత కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. అయితే నేటితో ఏం మాయ చేసావే సినిమా వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటో ను చైతుతో తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అంటూ పోస్ట్ పెట్టాడు. మరోవైపు సమంత కూడా `ఏం మాయ చేసావే`కి 13 ఏళ్లు అంటూ పలు ఫోటోలు షేర్ చేసింది. కానీ ఈ పిక్స్ లో కేవలం సమంత మాత్రమే ఉండటం గమనార్హం.