నందమూరి హీరోలకే సొంతమైన ఆ అరుదైన రికార్డ్ ఇదే…!

నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పుటి తరం హీరోలలోనే అరుదైనన రికార్డును సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లుఅర్జున్ వంటి హీరోలకే సాధ్యం కానీ ఆ అరుదైన రికార్డ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోలు డబుల్ రోల్స్ లో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘన విజయం నమోదు చేసుకున్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు అగ్ర హీరోలుగా ఉన్న చాలా మంది హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేశారు.

Jr. NTR's salute to half-brother Kalyan Ram: No one else can play Bimbisara

సౌత్ ఇండియన్ లోకనాయకుడు కమలహాసన్న్ ఏకంగా దశావతారం సినిమాలో 10 పాత్రులు చేసి రికార్డ్ సృష్టించాడు. మన తెలుగు సీనియర్ హీరో ఏఎన్నార్ కూడా 1966 లో వచ్చిన నవరాత్రి సినిమాలో ఏకంగా 9 పాత్రలో నటించాడు. నట సార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాలో కృష్ణుడిగా, కర్ణుడుగా, దుర్యోధనుడిగా మూడు విభిన్నమైన పాత్రలో నటించాడు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి కూడా ట్రిపుల్ రోల్స్ చేయటం కూడా జరిగింది.

Jai Lava Kusa movie review by audience: Live updates, JLK rating, Jr NTR,  Nivetha Thomas, Raashi Khanna, Bobby, KS Ravindra - IBTimes India

ఇప్పటి తరం హీరోలలో ఎవరు ట్రిపుల్ రోల్ సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ డ్యూయల్ రోల్ సినిమాలు చేశారు కానీ ట్రిపుల్ రోల్ సినిమాలు చేయలేదు. మహేష్ బాబు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ద్విపాత్ర అభినయం చేశాడు. ఇప్పుడు నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం డ్యూయల్ రోల్ తో పాటు ట్రిపుల్ రోల్‌ కూడా చేశారు. ఎన్టీఆర్ నా అల్లుడు, అదుర్స్ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించాడు.

Amigos: ఇదెక్కడి మేకోవార్ రా మావా… కళ్యాణ్ రామ్ ని గుర్తు పట్టడం కూడా  కష్టమే - NTV Telugu

జై లవకుశ సినిమాలో ఏకంగా ట్రిపుల్ రోల్ లో నటించి మెప్పించాడు. ఈ సినిమాను ఈ సంక్రాంతికి వ‌చ్చిన‌ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బాబి జై లవకుశ సినిమాను తెరకెక్కించాడు. కళ్యాణ్ రామ్ కూడా హరే రామ్ సినిమాలో ద్విపాత్ర అభినయం చేశాడు. ఇక‌ ఇప్పుడు తాజాగా నటించిన అమిగోస్ లో ట్రిపుల్ రోల్ లో నటించాడు. ఈ సినిమా ఈ నెల 10దో తారీఖున ప్రేక్షకులకు ముందుకు రానుంది. దీనిబట్టి ఈ తరం స్టార్ హీరోల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే ఈ అరుదైన రికార్డును అందుకున్నారు.