బాలయ్య పేరుతో ఉన్న సూప‌ర్ హిట్ సాంగ్స్ ఇవే… అన్నీ సూప‌రెహే…!

నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఎన్నో ప్రత్యేక పాత్రలలో నటించి వాటికి ప్రాణం పోశాడు. నటసింహం అభిమానులు మాత్రం ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరుతోనే ఎన్నో సినిమాలు డైలాగులు కూడా చెప్పారు. ఇప్పుడు జై బాలయ్య అనే పదం ఓ ఎమోష‌న్‌, ఓ స్లోగ‌న్ ల‌ మారిపోయింది.

Reddy Title for Balayya!

సినిమా పరిశ్రమలో బాలకృష్ణను అభిమానించే వారందరూ కూడా ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో బాలయ్య పేరుతోనే ఎన్నో సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలలో బాలయ్య పేరుతో వచ్చి సూపర్ హిట్ అయినా సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Jai Balayya Video Song [4K] | Akhanda | Nandamuri Balakrishna | Boyapati  Sreenu | Thaman S - YouTube

ముందుగా బాలకృష్ణ యాక్షన్ దర్శకుడు బి గోపాల్ కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్ సినిమాలో బాలయ్య బాలయ్య.. జయమ్మ జయమ్మా అనే సాంగ్ ఎంతో సూపర్ హిట్ అయింది. ఆ పాట ఇప్పటికీ కూడా బాలయ్య అభిమానులను ఊపేస్తూ ఉంటుంది. ఆ తర్వాత బంగారు బుల్లోడు సినిమాలో కూడా త‌కిదినితోం త‌కిదినితోం బాల‌య్యో.. ఇటు రావ‌య్యో సాంగ్ కూడా ఎంతో హిట్ అయింది. ఆ తర్వాత సీమ సింహం సినిమాలో కూడా కోకా రైక పాట చివరలో బాల‌య్యో ఏం గోల‌య్యా అనే లైన్ తో వచ్చిన ఈ పాట కూడా సూపర్ హిట్ అయింది.

Veera Simha Reddy - Jai Balayya Mass Anthem Lyric | Nandamuri Balakrishna |  Shruti Haasan | Thaman S - YouTube

ఇక ఆ తర్వాత పి వాసు దర్శకత్వంలో వచ్చిన మహారధి సినిమాలో ఒట్టిపెట్టి చెపుతా నా పేరు బాలకృష్ణ అనే పాట సూపర్ హిట్ అయినప్పటికీ సినిమా మాత్రం ప్లాఫ్ సినిమాగా మిగిలిపోయింది.
ఇక ఇప్పుడు తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా అఖండ ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జై బాలయ్య అనే సాంగ్ సినిమాలోనే కాకుండా టాలీవుడ్ ని ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ ప్రేక్షకులను అదరగొడుతూనే ఉంది.

NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న  బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

తాజాగా ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా ప్రేక్షకులు దగ్గరనుంచి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కూడా జై బాలయ్య అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇలా జై బాలయ్య అనే పేరుతో బాలకృష్ణ సినిమాల్లో వచ్చిన పాటలన్నీ ఎవర్‌గ్రీన్ సాంగ్స్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు బాలకృష్ణ తన 108వ సినిమాని స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా జై బాలయ్య అనే పదంతో ఓ పాట రాబోతుందని తెలుస్తుంది. ఈ పాట కూడా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో ..!