సినిమా కోసం ఏకంగా 150 కేజీలు పెరిగిన తెలుగు హీరో… బయటపడిన సీక్రేట్ (వీడియో)..!!

ప్రసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టేటస్ ఉంటేనే స్టార్ హీరోలు అయిపోరు టాలెంట్ ఉంటేనే స్టార్ హీరోలుగా ఎదగ గలరు అంటూ సామాన్య జనాలను సైతం ఇండస్ట్రీని రూల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ ని సైతం సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు . ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమాలో కంటెంట్ లేకపోతే సినిమాను అట్టర్ ఫ్లాప్ చేస్తున్నారు . ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాను ఎలాంటి డిజాస్టర్ గా మార్చారో మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే హీరోలు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు.

తన సినిమాలో కంటెంట్ ఉంటే విధంగా చూసుకునే టాలీవుడ్ హీరో సుధీర్ బాబు మరోసారి తన నటనను చూపించడానికి సిద్ధమైయాడు. ఎస్ ఎం ఎస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు బావ సుధీర్ బాబు ..మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇక తర్వాత ప్రేమ కథ చిత్రం , శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలలో నటిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన హంట్ సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు .

రీసెంట్ గా ఆయన నటించిన సినిమా “మాయ మశ్చీంద్ర”. ఈ సినిమాలో ని పాత్ర కోసం సుధీర్ బాబు ఏకంగా 150 కేజీలు పెంచాడు . ఈ సినిమా లో ఫ్యాట్ అబ్బాయి గా కనిపించడం కోసమే సుధీర్ బాబు ఇంత ర్స్క్ చేశాడు అంటూ తెలుస్తుంది . కాగా ఎవరో ఆకతాయిలు సినిమాకి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసేసి సుధీర్ బాబు లుక్స్ ని వైరల్ చేస్తున్నారు. అయితే లుక్స్ లో మాత్రం సుధీర్ బాబు కేక పెట్టిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అంతే కాదు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest