అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం..చేతులెత్తేసిన డాక్టర్లు..మరికొద్దిసేపట్లో కీలక ప్రకటన..!?

నందమూరి హీరో తారక రామారావు గారి మనవడు తారకరత్న జనవరి 27న కార్డియాక్ అరెస్టుకి గురైన సంగతి తెలిసిందే . లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అక్కడ జనాల తాకిడికి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఆ క్రమంలోనే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది . అయితే హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు టిడిపి కార్యకర్తలు. అక్కడ పరిస్థితి చేజారిపోతూ ఉండటంతో అదే రోజు అర్ధరాత్రి చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది .

కాగా గత 20 రోజులుగా అదే హాస్పిటల్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న తారకరత్న హెల్త్ కండిషన్ కొన్నిసార్లు బాగుంటున్న మరికొన్నిసార్లు క్షీణిస్తూ వస్తుంది . ఈ క్రమంలోనే తారకరత్న కోమాలోకి వెళ్లిపోయాడు . అంతేకాదు వైద్యులు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆయన స్పృహలోకి రాకపోవడం నందమూరి అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది . కాగా ఇదే క్రమంలో ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు . అయితే కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో విదేశీ వైద్యులు తారకరత్నకు చికిత్స నిమిత్తం బెంగళూరు చేరుకున్నారు .

గత కొన్ని రోజులుగా విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. అయినాకానీ తారకరత్న చికిత్సకి రెస్పాండ్ కాకపోవడం అభిమానులకు అంత చిక్కడం లేదు. ఈ క్రమంలోనే కోమాలో ఉన్న తారకరత్న స్పృహలకి తీసుకురావడానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ కూడా ఫైనల్ అస్త్రంగా ట్రై చేశారట. అయినా కానీ తారకరత్న చికిత్స్ కి స్పందించడం లేదు. ఈ క్రమంలోని తారకరత్న హెల్త్ కండిషన్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు అంటూ తెలుస్తుంది . అంతేకాదు డాక్టర్స్ తారకరత్న హెల్త్ బులిటెన్ ని మరికొద్ది సేపట్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కన్నడ మీడియా చెప్పుకువస్తుంది. ఏది ఏమైనా సరే మరో 24 గంటల్లో తారకరత్న హెల్త్ కండిషన్ పై పూర్తి డీటెయిల్స్ డాక్టర్లు బయటపెట్టబోతున్నారు. ఇదే క్రమంలో నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు..!!