త‌మ‌న్నా మామూల్ది కాదు.. ర‌జినీ `జైల‌ర్‌` కోసం అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అయిపోయిన ఇంకా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్ పరంగా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాలు `జైల‌ర్‌` ఒకటి. తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నెల్సన్‌ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్‌ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ ఇది.

సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌, రమ్యకృష్ణ, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగబాబు, సునీల్ తదిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ లో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టి డ‌బ్బై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా త‌మ‌న్నా కూడా త‌న పార్ట్ ను పూర్తి చేసేందుకు షూటింగ్ లో భాగ‌మైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు త‌మ‌న్నా అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. ఇంత వ‌ర‌కు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న త‌మ‌న్నా.. `జైల‌ర్‌` కోసం ఏరంగా రూ. 3.5 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ని నెట్టింట జోరుగా టాక్ న‌డుస్తోంది. దీంతో త‌మ‌న్నా మామూల్ది కాదంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు నెటిజ‌న్లు.

Share post:

Latest