శ్రీ‌లీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్‌ సెన్సేషన్ శ్రీలీల‌కు తాజాగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖ‌ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఇందులో పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట.

ఆ సాంగ్ కోసం మేక‌ర్స్ తాజాగా శ్రీ‌లీల‌ను సంప్రదించగా.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సాంగ్ కోసం శ్రీ‌లీల అందుకు రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఒక్క సాంగ్ కోసం ఈ యంగ్ బ్యూటీ ఏకంగా కోటి రూపాయిలు డిమాండ్ చేసింద‌ట‌. ఇప్ప‌డిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న శ్రీ‌లీల ఆ రేంజ్ లో డిమాండ్ చేయ‌డంతో మేక‌ర్స్ మొద‌ట షాక్ అయినా.. ఫైన‌ల్ గా ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్లు టాక్‌. దీంతో ఐటెం సాంగ్ కోస‌మే అంత ఛార్జ్ చేస్తుందా.. శ్రీ‌లీల మామూల్ది కాదు అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Share post:

Latest