క్రేజీ టాక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోంది!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ‌ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంట‌ర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

అలాగే మరోవైపు గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతోంది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే విజయ్ దేవరకొండ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందట. ఇంత‌కీ ఆ మూవీ మరేదో కాదు గీత గోవిందం. విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు.

2018 లో విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ ను దక్కించుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందట. ఇటీవలె డైరెక్టర్ పరశురామ్ గీత గోవిందం సీక్వెల్ క‌థ‌ను విజయ్ కు వినిపించాడట. అయితే ఆ కథ విజ‌య్ ను ఎంతగానో ఇంప్రెస్ చేయ‌డంతో.. వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే రష్మికను సైతం సంప్రదించి.. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వ‌నున్నార‌ని టాక్‌ నడుస్తోంది. మరి ఇదే నిజమైతే విజయ్‌, రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతారు.

Share post:

Latest