ఓటీటీలో ఒకే రోజు దండ‌యాత్ర చేయ‌బోతున్న సంక్రాంతి సినిమాలు.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్స్‌ విజయ్ దళపతి, అజిత్ కుమార్ సైతం సంక్రాంతి బరిలో సందడి చేశారు.

అజిత `తునివు(తెలుగులో తెగింపు)`తో రాగా.. విజయ్ `వ‌రిసు(తెలుగులో వారసుడు)` మూవీతో అలరించాడు. రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌లైన ఈ చిత్రాలు.. టాక్‌ ఎలా ఉన్నా పండగ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ నాలుగు చిత్రాలు ఒకే రోజు దండయాత్ర చేయడానికి సిద్ధ‌మ‌య్యాయి.

ఫిబ్ర‌వరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజ‌య్ `వార‌సుడు`, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో బాల‌య్య‌ `వీర సింహారెడ్డి`, నెట్ ఫ్లిక్స్ లో చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌` తో పాటు అజిత్ `తెగింపు` సినిమాలు స్ట్రీమింగ్ కాబోతోంద‌ని తెలుస్తోంది. అయితే తెగింపు సినిమా నెట్ ఫ్లిక్స్ తో అమెజార్ ప్రైమ్ లోనూ అందుబాటులోకి రాబోతోంది. మొత్తానికి ఒకేరోజు నాలుగు పెద్ద సినిమాలు ఓటీటీలోకి దిగితే ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు.