ఓ మై గాడ్: నాగార్జున మరదలు కూడా ఆ వ్యాధి తో బాధపడుతుందా..!

రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలు అందరూ వరుసగా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడుతూ అభిమానులను టెన్షన్ పడుతున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత ప్రపంచంలోనే అరుదైన వ్యాధి మయోసైటిస్ కి గురైన విషయం తెలిసిందే . ఈ వ్యాధి కారణంగా ఆమె ఏకంగా ఎనిమిది నెలలపాటు అనారోగ్యానికి గురైంది. కనీసం కాళ్లు కూడా కదలని పొజిషన్లో సమంత అష్ట కష్టాలు పడింది . ఎట్టకేలకు దక్షిణ కొరియా వెళ్లి ఆ వ్యాధికి సరైన చికిత్స తీసుకొని సేఫ్ గా బయటపడింది సమంత .

ప్రెసెంట్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది . కాగా ఇదే క్రమంలో పలువురు బడా బాలీవుడ్ స్టార్స్ , టాలీవుడ్ డైరెక్టర్స్ అరుదైన వ్యాధులను బయటపెట్టి అభిమానులకు కొత్త టెన్షన్ ని పెట్టారు. కాగా రీసెంట్ గా మరో నటి ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు చెప్పకు వచ్చింది . అక్కినేని నాగార్జున కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అన్నమయ్య సినిమాలో ఆయనకు మరదలు పాత్రలో నటించిన సీనియర్ నటి కస్తూరి గుర్తుందిగా.. ప్రజెంట్ స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ పాత్రలో నటిస్తుంది.

ఈమె చికెన్ ఫాక్స్ కు గురైన్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ” నాకు చికెన్ ఫాక్స్ సోకింది.. ఈ వ్యాధి వల్ల కొన్ని సార్లు ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విన్నాను.. చాలా అందవిహీనంగా మార్చేస్తుందని కూడా విన్నాను ..అయితే దేవుడి దయవల నాకు అలా ఏమీ కాలేదు. మీ అందరి ప్రేమ అభిమానాలకు నా కృతజ్ఞతలు. నేనిప్పుడు బాగానే ఉన్నాను” అంటూ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు చికెన్ ఫాక్స్ వల్ల ఆమె స్కిన్ ఎలా మారిపోయింది అన్న విషయాలను ఫోటోల రూపంలో అభిమానులకు తెలియజేసింది. ప్రజెంట్ కస్తూరి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

Share post:

Latest