`ఎన్టీఆర్ 30` స్టోరీ లీక్.. కొర‌టాల ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌ పై క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి సుధాక‌ర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ముందుగానే ప్రకటించారు మేకర్స్. కానీ, ఇంత వ‌ర‌కు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక‌పోవ‌డం ప‌ట్ల ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ మార్చి 20 తర్వాత స్టార్ట్ అవుతుందని తాజాగా తారక్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయింది. త‌న గ‌త చిత్రం `ఆచార్య‌` ఫ్లాప్ అవ్వ‌డం కార‌ణంగా కొర‌టాల ఈసారి ఎన్టీఆర్ తో గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక కల్పిత ఐలాండ్ లో `ఎన్టీఆర్ 30` కథ నడుస్తుందట. అలాగే సీపోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుంద‌ట‌. మదర్ నేచర్ వంటి సామాజిక కోణాన్ని కూడా జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest