తారకరత్న బ్రతికి ఉన్నప్పుడు రాని ప్రేమ..చచ్చాక వచ్చిందా..?

సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే ముగిశాయి . జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో తారకరత్న అంతిమ సంస్కారాలను ఆయన తండ్రి మోహన్ కృష్ణ దగ్గరుండి అన్ని సాంప్రదాయ బద్దంగా పూర్తి చేశారు . కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు..ఫ్యాన్స్ అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు . అంతకుముందు ఫిలిం చాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర సాగింది. భౌతిక కాయం రథంలో బాలకృష్ణ – చంద్రబాబు నాయుడు అన్ని దగ్గరుండి పనులు చూసుకున్నారు.

తారకరత్న బ్రతుకి ఉన్నంత వరకు పట్టించుకోని డైరెక్టర్లు ..హీరోలు.. ప్రొడ్యూసర్లు తారకరత్న మరణించిన తర్వాత ఆయనలోని గొప్ప విషయాలని.. మంచి విషయాన్ని చెప్తూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. బతికున్నప్పుడు ఆయన ఆఫర్ లు అంటూ అడిగిన ఏ డైరెక్టర్ కరుణించలేదు ..ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ పడుతున్నప్పుడు.. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు.. నా అనుకున్న వాళ్ళు ఒకరు హెల్ప్ చేయలేదు ..తీరా చనిపోయాక మాత్రం ఆయన మంచి మనిషి అని ఆయనతో స్నేహబంధం ఇదే అని పొగిడేస్తున్నారు .

బతికి ఉన్నప్పుడు చూపించిన ప్రేమ … చనిపోయిన తర్వాత చూపించడం దేనికి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఫస్ట్ సినిమా హిట్ అయినా సరే ఆ తర్వాత సినిమాలు సక్సెస్ కాలేదు. హిట్ కోసం చాలా విధాలుగా ట్రై చేశారు కానీ.. ఎందుకో తారకరత్న నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది .

 

ఈ క్రమంలోనే కెరియర్ పుంజుకోవడానికి ఎంతో మంది స్టార్ డైరెక్టర్ లకు ప్రొడ్యూసర్స్ లకు తెలిసిన వాళ్లకు సినిమా అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశారు . అయినా ఏ ఒక్కరు ఆయనతో సినిమా తీయడానికి ముందుకు రాలేదు. తీరా ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఇలాంటి ప్రేమ వలకబోస్తున్నారు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు . గతంలో ఉదయ్ కిరణ్ విషయంలోనూ ఇలానే జరిగింది . బ్రతికున్నప్పుడు ఎవరు ఆయన గురించి పట్టించుకోలేదు .. చనిపోయిన తర్వాత మా ఉదయ్ కిరణ్ మంచోడు అంటూ అందరూ డప్పు కొట్టి మరి హంగామా చేశారు . ఈ క్రమంలోనే బ్రతికున్నప్పుడు చూపించిన ప్రేమ చనిపోయిన తర్వాత చూపిస్తే దేనికి పనికొస్తుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు…!!!

Share post:

Latest