నందమూరి కళ్యాణ్ రామ్ ఇంత రొమాంటికా..ఆ ఒక్క మాటకు కన్నడ పిల్ల ఫిదా (వీడియో)..!!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే . ముందు కాలం ఎలా ఉన్నా సరే .. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ పేరు సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. కాగా బింబిసారా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్.. రీసెంట్గా నటిస్తున్న సినిమా అమిగోస్.. టైటిల్ తోని హ్యూజ్ సస్పెన్స్డ్ ని క్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్.. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా అదరగొట్టేశారు.

ఏకంగా ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నారు . కాగా ఈ సినిమాలో కళ్యాణ్రామ్ తో ఫస్ట్ టైం రొమాన్స్ చేయబోతుంది కన్నడ బ్యూటీ ఆశిక రంగనాథ్ . అంతే కాదు ఆశికా తెలుగు కి ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇదే కావడం గమనార్హం. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 10న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ పనులను ప్రారంభించారు చిత్ర బృందం.

ఈ క్రమంలోనే బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న సుమ అడ్డ షో కు గెస్ట్లుగా వచ్చారు అమిగోస్ చిత్ర యూనిట్ . ఈ క్రమంలోనే సుమ నందమూరి కళ్యాణ్రామ్ ను ఓ ఆట ఆడేసుకునింది.. అసలు అమిగోస్ అంటే ఏంటి అంటూ డైరెక్ట్ గా ప్రశ్నించేసింది. కళ్యాణ్రామ్ సైతం తడబడకుండా అమిగోస్ అంటే ఫ్రెండ్షిప్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఫ్రెండ్సే పెట్టొచ్చుగా ఎందుకు తలనొప్పి టైటిల్ అంటూ కౌంటర్ వేసింది.

అంతేకాదు టాస్క్ లో భాగంగా అందాల ముద్దుగుమ్మ ఆశిక రంగనాధ్ కు నందమూరి హీరో చేత లవ్ ప్రపోజల్ చేయించింది. బిడియంగానే లవ్ ప్రపోజ్ చేసిన కానీ తనదైన స్టైల్ లో రొమాన్స్ ని బయట పెట్టేసాడు నందమూరి హీరో.. అంతేనా పక్కనే ఉన్న సుమను మీరు ఆమె కన్నా ఇంకా బాగున్నారు అంటూ రోజ్ ను ఇవ్వడం హైలైట్ గా మారింది . దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే అమిగోస్ తో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్ అని పక్కాగా చెప్పొచ్చు..!!

Share post:

Latest