వామ్మో..ఏంటి ఇలా మాట్లాడుతుంది..మెగా అభిమానులను టెన్షన్ పెడుతున్న కోడలు పిల్ల..!!

మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే . గత పదేళ్లుగా మెగా అభిమానులు , మెగా హీరోలు , మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా వెయిట్ చేసిన న్యూస్ ఎట్టకేలకు రివీల్ చేశారు మెగా మెగాస్టార్. రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన క్షణం ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యాను అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

అప్పటినుంచి మెగా కోడలు ఉపాసన గురించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . కాగా రీసెంట్గా మెగా కోడలు ఉపాసన పెట్టిన కామెంట్ జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె హెల్త్ కండిషన్ బాగోలేదా అంటూ మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా , హీరోయిన్ కీయారా అద్వాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

రీసెంట్ గానే జైపూర్ లో గ్రాండ్ గా వీళ్ల పెళ్లి జరిగింది . ఉపాసన రాంచరణ్ దంపతులని ఈ పెళ్లికి స్పెషల్గా ఇన్వైట్ చేసింది కీయారా అద్వానీ, అయితే కొన్ని ” కారణాల వల్ల మేము అటెండ్ కాలేకపోయాం క్షమించు కీయారా” అంటూ కామెంట్ పెట్టుకు వచ్చింది ఉపాసన . ఈ క్రమంలోనే రీసెంట్గా శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి అటెండ్ అయిన ఉపాసన అప్పటి నుంచి సిక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఉపాసన కియారా – సిద్ధార్థ బెల్హోత్ర పెళ్లికి అటెండ్ కాలేకపోయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మెగా అభిమానులు ఉపాసన హెల్త్ పై టెన్షన్ పడుతున్నారు..!!

Share post:

Latest