హీరో రవితేజ రిచ్చో రిచ్చు..ఇండియాలో అసలు ఆ పనే చేయడట..ఏమి రాజాభోగమో..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రేజ్ ఉన్న క్రేజ్ లేకపోయినా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ బయటికి వచ్చినప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మాస్ మహారాజు రవితేజ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. దానికి మెయిన్ రీజన్ ఆయన లేటెస్ట్ గా నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్ అందుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయినా రవితేజ .. ఆ తర్వాత బాబి డైరెక్షన్లో తెరకెక్కిన చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోను నటించాడు .

రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ సక్సెస్ ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రెండూ సినిమాలు 100 కోట్లు దాటేసింది . కాగా ఇలాంటి టైం లోనే రవితేజ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తను వైరల్ చేస్తున్నారు జనాలు . కాగా ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనికెళ్ల భరణి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” నేను ఇండియాలో అస్సలు షాపింగ్ చేయనని.. షర్ట్ కావలన్నా ఫారిన్ లోనే కొనుకుంటానని..ఏది కావాలన్నా నేను ఫారిన్ కంట్రీస్ లోనే కొనుక్కుంటానని ..అక్కడికి వెళ్ళినప్పుడే నాకు కావాల్సినవన్నీ నేనే దగ్గర ఉండి కొని తెచ్చుకుంటానని.. నా కాస్టూమ్స్ కూడా నేనే చూసుకుంటానని చెప్పకు వచ్చారు.

అంతేకాదు ఇండియాలో ఇప్పటివరకు మీరు ఏం కొనలేదా..? అన్న ప్రశ్నకు కూడా ఇండియాలో నేను ఏమి కొనని ..ఆయన స్లాంగ్ లో..ఆయన వర్షన్ లో వివరించారు. దీంతో కొందరు ఆయనను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇండియాలో అసలు ఏమి కొన్నంత స్థాయికి ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడా ..?అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . కొందరు దీనినే రాజభోగం అంటారు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!

Share post:

Latest