ప్రస్తుతం ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్స్ లో యూత్ కి మాస్ ఆడియన్స్ కి ఎంతో విపరీతంగా నాచేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ లీల అనే చెప్పాలి.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ సినిమాకి ప్లాఫ్ టాక్ వచ్చినప్పటికీ కూడా భారీ కలెక్షన్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం శ్రీ లీల అనే చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ఈమె రవితేజకు జంటగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి ప్రధాన కారణం కూడా శ్రీ లీల. అందుకే ఇప్పుడు స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకు అందరూ శ్రీ లీల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత భారీ క్రేజ్ దక్కించుకున్న శ్రీ లీల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.
అలా ఆమె గురించి సోషల్ మీడియాలో మన కుర్రాళ్ళు వెతుకుతున్నప్పుడు. ఆమె గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈమె ప్రముఖ కన్నడ పాన్ ఇండియా హీరో యాష్ కి దగ్గర బంధువు అవుతుందని.. అతని వల్లే ఈమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని శ్రీ లీలా రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ ఒక ప్రైవేట్ హాస్పటల్లో పెద్ద డాక్టర్.. ఆమె యాష్ భార్య ప్రెగ్నెంట్ అయిన సమయంలో ఆమెకి డెలివరీ చేసింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి అందరూ నేను యాష్ కి దగ్గర బంధువు అవుతానని ప్రచారం చేయడం మొదలుపెట్టారు అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.