ధర్మవరం-రాప్తాడు ఎమ్మెల్యేలకు చెక్..పరిటాలకు సాధ్యమేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు టి‌డి‌పికి కంచుకోటలు. గతంలో ఇక్కడ టి‌డి‌పి హవా నడిచింది. అందులోనూ పరిటాల ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల టి‌డి‌పి ఓటమి పాలైంది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. అటు ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సూరి ఓడిపోయాక టి‌డి‌పిని వదిలి బి‌జే‌పిలోకి వెళ్లారు.

దీంతో రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు. రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసి రెండు సీట్లలో గెలవాలని పరిటాల ఫ్యామిలీ చూస్తుంది. అయితే అనుకున్న మేర పరిటాల ఫ్యామిలీ బలపడినట్లు కనిపించడం లేదు. రాప్తాడులో బెటర్ గానే ఉన్నారు..కానీ ధర్మవరంలో ఇంకా పికప్ అవ్వాలి. అయితే అతి త్వరలోనే నారా లోకేశ్ పాదయాత్ర రెండు స్థానాల్లోనూ జరగనుంది. ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్పి శ్రీరామ్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు స్థానాల్లో గ్రామాల్లో తిరుగుతూ..కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.

లోకేశ్ పాదయాత్రని విజయవంతం చేయాలని కోరుతున్నారు. భారీ స్థాయిలో పాదయాత్రకు టి‌డి‌పి శ్రేణులని సమాయత్తం చేస్తున్నారు. ఇక పాదయాత్ర ద్వారా గాని రెండు స్థానాల్లో టి‌డి‌పి బలం మరింత పెరుగుతుందేమో చూడాలి. లోకేశ్ పాదయాత్రని సక్సెస్ చేసి రాప్తాడు, ధర్మవరం ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

అయితే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి చెక్ పెట్టే ఛాన్స్ ఉంది గాని..ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డితోనే ఇబ్బంది. ఆయన ఎక్కువ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో ప్రజా బలం కాస్త కనిపిస్తుంది. ప్రజల్లో మైకులు పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని టి‌డి‌పి విమర్శలు చేస్తుంది. మరి ధర్మవరం ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. మరి రెండుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు పరిటాల చెక్ పెడతారేమో చూడాలి.

Share post:

Latest