జమున ఆ కారణంగానే తన కొడుకుకి ఆస్తి దక్కకుండా చేసిందా..!

మన సీనియర్ హీరోయిన్స్ లో మహానటి సావిత్రితో సరి సమానమైన ఇమేజ్ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది జమున మాత్రమే. ఆరోజుల్లో ఈమె రెమ్యూనరేషన్ కూడా అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ కంటే ఎక్కువగా ఉండేదట.. దీని బట్టి ఆమె ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చిన కచ్చితంగా అందులో హీరోయిన్‌గా జమున ఉండాల్సిందే. అలా మూడు దశాబ్దాల పాటు తెలుగు తెరపై టాప్ 2 హీరోయిన్స్ లో ఒకరిగా ఉంది జమున.

తన సినిమాల పరంగా సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా తెలివిగా ఖర్చు చేసేదట. ఇక ఆ టైంలో మార్కెట్లోకి ఏదైనా విలువైన వస్తువు వచ్చిందంటే కచ్చితంగా అది జమున ఇంట్లోకి రావాల్సిందే. అంతేకాకుండా ఆమె ఆ రోజుల్లోనే చెన్నై మరియు హైదరాబాద్ వంటి మహానగరాలలో తన సంపాదించుకున్న ఆస్తి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టింది.

Jamuna family

తద్వారా తన ఆస్తిని కూడా బాగా పెంచుకుంది. ప్రస్తుతం ఈమె దగ్గర ఉన్నంత ఆస్తులు చాలా మంది స్టార్ హీరోలు రాజకీయ నాయకులు దగ్గర లేవని కూడా అంటారు. జమున గారికి ఇద్దరు పిల్లలు వారిలో కొడుకు పేరు వంశీ జూలూరి, కూతురు పేరు స్రవంతి రావు.. కూతురు పలు సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కొడుకు వంశీ అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. అయితే జమునకు తన కూతురు, కొడుకు అంటే ఎంతో ఇష్టమట.

Jamuna Daughter In Law

తాను మరణించిన తర్వాత కూడా తన ఆస్తి మొత్తం తన మనవడికి చెందాలి అంటూ వీలునామా కూడా రాసిందట. ఇందులో మరో విశేషం ఏమిటంటే జమున తన కొడుకు పేరు మీద ఒక ఆస్తి కూడా ఇవ్వలేదట. ఎందుకంటే తన కొడుకు జీవితంలో బాగా సెటిలైపోయారని భావించిందట. అందుకే తనకున్న ఆస్తి మొత్తం తన మనవడికే చెందేలా చేసిందని అంటున్నారు. ఈ మధ్యనే జమున గారు స్వర్గస్తులైన విషయం మనకు తెలిసిందే.