ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా ఎమోషనల్ అవుతున్న తమన్..!!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కూడా తెలియజేస్తూ ఉండడంతో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశామని అప్పటికే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తనని ఫైనలైజ్ చేయలేదని..థమన్ తెలియజేశారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని తెలియజేశారట.

Aravinda Sametha Veera Raghava Success Meet Photos HD | New Movie Posters

ఎన్టీఆర్ సాధారణంగా పాటలను ఫుల్ వాల్యూమ్ లు వినడానికి ఇష్టపడతారని సంగీతం కు తారకు అంటే చాలా ఇష్టమని థమన్ తెలిపారు.అయితే రెండు పాటలు వింటూ మ్యూజిక్ డైరెక్టర్ నేనేనా అని వంశీ పైడిపల్లి ని అడిగి ఆ తర్వాత తారక్ తనకి ఫోన్ చేశారని థమన్ తెలియజేశారు. ఆ తర్వాత ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు తారక్ అడగగా తారకను కలవడానికి వెళ్ళానని తెలియజేశారు. ఈ ఘటన జరిగే సమయానికి తన మ్యూజిక్ డైరెక్టర్లు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని అయినప్పటికీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం ఎన్టీఆర్ గొప్పతనం అని తెలిపారు థమన్.

జీవితాంతం ఎన్టీఆర్ కు నేను రుణపడి ఉంటానని తెలియజేశారు. ఆ రీజన్ వల్లే తారక్ కు నేను ఎప్పుడూ కూడా ఫ్లాప్ మ్యూజిక్ ఇవ్వలేదని కూడా తెలిపారు. ఎన్టీఆర్ అంటే 200% బెస్ట్ మ్యూజిక్ ఇస్తానని థమన్ తెలియజేశారు తారక్ కలవాలని చెప్పిన ఏ సమయంలో ఉన్నప్పటికీ కచ్చితంగా వెళ్తానని తెలియజేశారు. ఈ విషయాలు విన్న యంగ్ టైగర్ అభిమానులు ఫిదా అవుతున్నారు.