ప్ర‌భాస్ త‌ర్వాత మ‌హేష్‌తోనే ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌.. స్కెచ్ గీసింది ఎవ‌రో తెలుసా..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చిన‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ‌న వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో సినిమా కోసం కోన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా అది మాత్రం వర్కౌట్ అవటం లేదు. తాజాగా ఈ కాంబో సెట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ చేసే సినిమాలు పూర్తయిన వెంటనే అల్లు అరవింద్ బ్యాన‌ర్లో తన తర్వాత సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఇంతకీ ఈ బ్యానర్లో మహేష్ సినిమాకు డైరెక్టర్ ఎవరు అన్నది దానిపై ఓ అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గీత బ్యానర్ లో ఉన్న డైరెక్టర్ల‌కే అవకాశం ఇస్తారా ? లేక మరో కొత్త డైరెక్టర్‌ను తీసుకొస్తారా అనేది చూడాలి. మహేష్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ లిస్టులో సందీప్ వంగా కూడా ఉన్నారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో మ‌హేష్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు.

గీతా ఆర్ట్స్ తో మహేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ ఆయనకే వెళుతుందని టాక్. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మహేష్ తో ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. అయితే ఈ లోగా త్రివిక్ర‌మ్‌, రాజ‌మౌళి సినిమాలు కంప్లీట్ కావాల్సి ఉంది.

Share post:

Latest