రాయలసీమ ప్రాంతంలో రెడ్డి వర్గం ప్రభావం ఎలా ఎక్కువ ఉంటుందో…ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం హవా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో రెండు పార్టీల్లోనూ కమ్మ నేతలు ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాల్లో అటు టిడిపి, ఇటు వైసీపీలో కమ్మ నేతలు ఉన్నారు. ఇక ఈ సారి రెండు పార్టీల్లో ఉన్న కమ్మ నేతలు ఎవరు గెలిచి బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన కమ్మ నేత ఎవరు గెలవలేదు. వైసీపీ నుంచి మాత్రం వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు గెలవగా, నరసారావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. ఇక వీరిలో ఈ సారి ఎవరు గెలుస్తారంటే? చెప్పే పరిస్తితి కనిపించడం లేదు. ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలకు గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇటు ఎంపీ సీటులో కూడా వైసీపీకి పాజిటివ్ పెద్దగా లేదు. ఎంపీగా శ్రీకృష్ణకు పాజిటివ్ ఉన్నా..పార్టీ పరంగా పాజిటివ్ లేదు.
కాబట్టి ఈ సారి వైసీపీ కమ్మ నేతలకు గెలుపు అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇక టిడిపి కమ్మ నేతల గురించి చూసుకుంటే పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్రకు గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అటు మంగళగిరిలో లోకేష్క గురించి చెప్పాల్సిన పని లేదు. అక్కడ పాజిటివ్ గానే ఉంది.
ఇటు తెనాలిలో ఆలపాటి రాజా ఉన్నారు కానీ ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. అటు వినుకొండలో జీవీ ఆంజనేయులు పరిస్తితి మెరుగ్గానే ఉంది. అయితే చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్..కాస్త గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఈ సారి గుంటూరులో టిడిపి కమ్మ నేతలు పైచేయి సాధించేలా ఉన్నారు.