ఓసి నీ అభిమానం తగలెయ్య.. హీరో అంటే ఇష్టంతో ఏం చేసిందో చూడండి..!!

జనరల్ గా ఎక్కడైనా సరే మనం అభిమానించే హీరో హీరోయిన్ బయట కనిపిస్తే వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకుంటాం . లేదా వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది వివరిస్తాం. ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి . అయితే ఓ అభిమాని మాత్రం తన ఫేవరెట్ హీరో కనిపించేసరికి హద్దులు మీరిపోయింది.. ఆనందంతో ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలియకుండా అతగాడిను తల లాక్కొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ కూల్ అండ్ క్లాసిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . రీసెంట్గా ఈ హీరో నటించిన వెబ్ సిరీస్ నైట్ మేనేజర్. ఈ సిరిస్ స్క్రీనింగ్ ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో జరిగింది . ఈ స్క్రీనింగ్ కు హాజరయ్యాడు ఆదిత్య . అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు లేడీస్ ఫ్యాన్స్ ఆయన కోసం అక్కడ వెయిట్ చేశారు. ఈ క్రమంలోనే కారులో నుంచి ఆయన బయటకు దిగ్గుతుండగా.. వెంటనే పరుగు పరుగున కొంతమంది లేడీ ఫ్యాన్స్ ఆయనని చుట్టూ ముట్టారు .

ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఎంతగా వాళ్లను కంట్రోల్ చేయాలన్న ఆ లేడీస్ ఒప్పుకోలేదు . దీంతో ఆదిత్య ఒక్కొక్కరిగా పిలిచి సెల్ఫీలు ఇస్తూ ఉండగా ఆయనంటే అభిమానంతో ఊగిపోయే ఓ లేడీ ఫ్యాన్ తన అభిమానాన్ని దాచుకోలేకపోయింది . ఈ క్రమంలోని హగ్ చేసుకుని ఫోటోలు దిగింది. అంతేనా కొంచెం హద్దుల మీరి అతగాడి ని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసింది. అతగాడు నో అంటున్న వినకుండా ట్రై చేసింది . ఈ క్రమంలోనే చాలా సున్నితంగా ఆమె దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసాడు ఆదిత్య .

అయినా విడవలేదు..ఒకటి ప్లీజ్ అంటూ ముందుకు వచ్చింది . ఈ క్రమంలోనే కూసింత చిరాకుతో సహనంగానే ఆమెను నట్టేసాడు . ఈ క్రమంలోనే అలెర్ట్ అయినా సెక్యూరిటీ ఆదిత్యాను నెమ్మదిగా లోపలికి పంపించేశారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలా మన ఫేవరెట్ హీరో కనిపించిన్నంత మాత్రానా హద్దులు మీరాల్సిన పని ఏముంది అంటూ మండిపడుతున్నారు జనాలు. కొందరైతే ఫాన్స్ అయితే ఇలా హీరోలను వేధిస్తారా అంటూ కౌంటర్ ట్వీట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

Share post:

Latest