చచ్చినా అలా చేయను.. పవన్ కళ్యాణ్ వచ్చి అడిగినా సరే.. యంగ్ బ్యూటీ సెన్షేషనల్ కామెంట్స్..!!

పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? నోవే . ఆయన పేరు చెప్తేనే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. ఆయనను దూరం నుంచి ఒక్కసారి చూసినా చాలు అనుకునే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు . మరి ముఖ్యంగా లేడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనతో ఒక్కసారి అయినా పక్కన నిల్చోని సెల్ఫీ దిగాలి అని కొన్నేళ్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు .

అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం వచ్చినా,, నేను నటించను అని హీరోయిన్ చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ గా అనిపిస్తుంది . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక జవల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు సినిమాలతో కూడా పాపులారిటీ తెచ్చుకొని మంచి పేరు సంపాదించుకుంది .

ప్రజెంట్ బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లో తరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను పవన్ కళ్యాణ్ కు బిగ్ అభిమానిని ..ఒకవేళ ఆయనతో సినిమాలో నటించే అవకాశం వచ్చినా నేను చేయనని ..ఆయనకు నేను ఎప్పుడు వీర అభిమానిగానే ఉంటానని ..”చెప్పుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది . కొందరు ప్రియాంక జవాల్కర్ కామెంట్స్ లో సమర్ధిస్తుంటే.. మరి కొందరు మెంటల్ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)