ఎందుకు నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు…సీరియస్ అయినా రష్మిక మందన్న‌..!

సౌత్ చిత్ర పరిశ్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న‌.. ఈమె ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ఈమె గత కొంతకాలంగా ఏమి మాట్లాడుతున్న.. అది సోషల్ మీడియాలో పెద్ద తప్పుగానే వినిపిస్తుంది. కన్నడ సూపర్ హిట్ కాంతార రిలీజ్ సమయంలో ఈమె చేసిన కామెంట్స్ ఎంతో వైరల్ గా మారాయి. అలానే ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా ఆమె చేసిన కామెంట్స్ కన్నడ చిత్రపరిశ్రమంలో ఆమెను బ్యాన్ చేయాలనే డిమాండ్ కు దారి తీసాయి.


ఈ విషయంలో ఆమెను బాగా ఆడుకున్నారు నెటిజన్లు. ఇక రీసెంట్గా సౌత్ సినిమాలలో రొమాంటిక్ సాంగ్స్ గురించి ఈమె చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. ఇవన్నీ కలిసి రష్మికపై జనాల్లో ఓ నెగటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలపై రష్మిక బాధపడుతుంది. ఈ సందర్భంలోనే రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..’ కొందరు నా మాటలను కావాలనే వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అలానే కొన్ని మీడియా సంస్థలు నాపై తప్పుగా చూపిస్తున్నాయని రష్మిక ఆ ఇంటర్వ్యూలో ఆరోపించింది’.

ఈ క్రమంలోనే తన చేసిన కామెంట్లను వివరిస్తూ ‘బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ బాగుంటై అని చెప్పే సమయంలో సౌత్ సినిమాలో ఐటెం సాంగ్స్, మాస్ పాటలు తప్ప రొమాంటిక్ సాంగ్స్ ఉండవన్నట్లుగా మాట్లాడింది’ ‘రష్మిక..దక్షిణాది చిత్ర పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని ఆమెపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల‌ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో రష్మిక నేరుగా ఈ ట్రోలింగ్ పై స్పందించింది’.

‘ఇక తాను చెప్పింది ఎవరు పూర్తిగా వినడం లేదని.. తాను చేసిన వ్యాఖ్యలను మధ్యలో కట్ చేసే వాటిని వైరల్ చేస్తున్నారని..దీనివల్ల తన అభిప్రాయాలు తప్పుగా వెళ్తున్నాయని రష్మిక వాపోయింది’. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇక దీంతో కొందరు కావాలనే ఈమెపై నెగిటివిటీ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని రష్మిక ఫ్యాన్స్ వాపోతున్నారు. దీంతో ఏదేమైనా రష్మిక సోషల్ మీడియాని హ్యాండిల్ చేయటంలో తీవ్రంగా విఫలమైంది. దీంతో ఇన్ని వివాదాలకు కారణమైంది.