`వాల్తేరు వీర‌య్య‌` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. ఇక ఆన్‌లైన్ లో పూనకాలు లోడింగే!

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఆరేళ్ల తర్వాత కమర్షియల్ గా `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శృతిహాసన్ కేథరిన్ హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చెలరేగిపోయింది.

అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్ము దుమారం రేపింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. ప‌ది రోజుల్లో రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. వాల్తేరు వీరయ్య డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది.

 

అయితే ఈ సినిమాను ఎప్పటినుంచి స్ట్రీమింగ్ చేయాలని విషయంపై తాజాగా మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి దింపాలని స్ట్రీమింగ్ గా డేట్ ను లాక్ చేశార‌ట‌. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఆన్‌లైన్ లో పూనకాలు లోడింగే అంటూ కామెంట్లు చేస్తున్నారు.