“వాల్తేరు వీరయ్య” షార్ట్ రివ్యూ : సినిమా హిట్..స్టోరీ ఫట్..!!

ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన చిరంజీవి నటించిన మాస్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది. కాగా మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ మొదటి షో పడగానే వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చేశారు . అంతేకాదు ఇన్నాళ్లు చిరంజీవి తీసిన సినిమాలలో ఎక్కువగా కంటెంట్ పైనే ద్యాస పెట్టారు. కానీ ఈ సినిమా లో మాస్ లుక్స్ తీసుకొని వాల్తేరు వీరయ్య విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి .

అంతే కాదు సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ మరో పాత్రలో కనిపించడం సినిమాకి హైలెట్ గా మారింది . సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్లతో.. పలు పంచ్ డైలాగ్స్ తో..లవ్ రొమాన్స్ , కామెడీతో నెట్టుకొచ్చేసిన బాబి ఇంటర్వెల్ సస్పెన్స్ ని..బాగా డిజైన్ చేశాడు . అంతేకాదు ఈ సినిమాల్లో మనం 20 ఏళ్ల ముందుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవిని చూడొచ్చు . అంతలా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెగాస్టార్ చిరంజీవి తన ఎనర్జీ లెవెల్స్ ను ఏ మాత్రం తగ్గకుండా సీన్ సీన్ కి విజృంభించేశాడు .

మరీ ముఖ్యంగా సినిమాలో మాస్ మహారాజా రవితేజ – చిరంజీవి మధ్య వచ్చే డైలాగ్ స్ మెగా ఫ్యాన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాయి . కాగా మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు సినిమా స్టోరీ పాతదే కొత్త కంటెంట్ ఏమీ లేదు.. కానీ బాబీ తనదైన స్టైల్ లో అక్కడక్కడ మసాలలను దట్టించి ..కామెడీ సీన్స్ ని యాడ్ చేసి.. మెగాస్టార్ చిరంజీవిని – రవితేజను బాగా వాడుకునేసి.. శృతిహాసన్ , కేథరిన్ అందాలను జనాలకు ఎరగావేసి ఎట్టకేలకు హిట్ కొట్టేశాడు . ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా సూపర్ హిట్..కానీ స్టోరీ ఫట్ అనే అంటున్నారు జనాలు . చూడాలి మరి కలెక్షన్స్ పరంగా వీరయ్య ఏ రేంజ్ లో మెప్పిస్తుందో..?