నటసింహం నోటి దూల.. “బుల్ బుల్ అంటూ బాలయ్య ” అడ్డంగా ఇరుక్కుపోయాడుగా..!!

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు .. బాలయ్య ఏదో చెప్పబోయే ఎవరినో నవ్వించబోయి తానే నవ్వుల పాలయ్యాడు . ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మీమ్ రాయళ్లకు పిచ్చపిచ్చగా కంటెంట్ ఇచ్చాడు బాలయ్య . మనకు తెలిసిందే వీర సింహారెడ్డి సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో . నిజానికి ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు అంటూ జనాలు చెప్పుకున్న ..పండగ పుణ్యమా అని హిట్ కొట్టాడు బాలయ్య .

అయితే వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్టేజిపై బాలయ్య ఓ రేంజ్ లో మాట్లాడి వైరల్ అయ్యాడు . మరీ ముఖ్యంగా వచ్చి రాని హిందీ భాషను మాట్లాడుతూ బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బూతు కామెంట్లను వినిపిస్తున్నాయి . బాలయ్య మాట్లాడిన హిందీని ట్రోల్ చేస్తూ ఫన్నీ వీడియోలను పెడుతూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు గతంలో సారే జహాసే అచ్చా అంటూ పాడుతూ బుల్ బుల్ అని బాలయ్య అభాస పాలైన సంగతి తెలిసిందే .

రీసెంట్ గా వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా అలాగే వచ్చి రాని హిందీని మాట్లాడుతూ బూతులు మాట్లాడాడు . ఎంతలా అంటే రాయడానికి కూడా పచ్చిగా వల్గర్ గా ఉండేలాంటి బూతులను మాట్లాడాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యాడు బాలయ్య అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు . అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య పై వచ్చే మీమ్‌స్ ను తట్టుకోలేకపోతున్నారు . అంతేనా 60 ఏళ్ళు వచ్చిన ఇంకా బాలయ్యలో మెచ్యూరిటీ రాలేదు అంటూ నందమూరి యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు..!!