వీర సింహారెడ్డి టోటల్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే బాల‌య్య ఎంత రాబ‌ట్టాలి?

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మాస్‌ ఎంటర్టైనర్ `వీరసింహారెడ్డి` రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హాని రోజ్‌ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు.

ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూశాక బాలయ్యకు మరో హిట్ ఖాయమని నందమూరి అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచ‌డంతో ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. తాజాగా వీర సింహారెడ్డి టోటల్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. వరల్డ్ వైడ్ గా రూ. 73 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక ఏరియాల వారీగా వీర సింహారెడ్డి టోట‌ల్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 15 కోట్లు
సీడెడ్: 13 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 9 కోట్లు
తూర్పు: 5.2 కోట్లు
పశ్చిమ: 5 కోట్లు
గుంటూరు: 6.40 కోట్లు
కృష్ణ: 5 కోట్లు
నెల్లూరు: 2.7 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ = 61.30 కోట్లు
——————————

క‌ర్ణాట‌క‌: 4.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.00 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 6.2 కోట్లు
——————————-
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ = రూ. 73 కోట్లు
——————————-

మొత్తంగా వ‌ర‌ల్డ్ వైడ్‌ గా రూ. 73 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బిరిలోకి దిగుతోంది. మ‌రి ఈ టార్గెట్ ను అందుకుని బాల‌య్య హిట్ కొడ‌తాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.