“అమ్మాయిలే కాదు..అబ్బాయిలు కూడా కోరికలు తీర్చాల్సిందే”.. సినీ ఇండస్ట్రీ గుట్టు రట్టు చేసిన యంగ్ హీరో..!!

ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి అమ్మాయిలు మాత్రమే క్యాస్టింగ్ కోచ్ ఎదుర్కున్నారని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అంతా అనుకున్నారు . ఎవరు ఊహించిన విధంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలి అన్న అబ్బాయిలు కూడా కొందరు కోరికలు తీర్చాల్సిందే అంటూ యంగ్ హీరో సంచలన కామెంట్స్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఆ యంగ్ హీరో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం స్టార్ హీరోయిన్స్ అవ్వాలన్న .. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అన్న .. కొందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ కోరికలు తీర్చాల్సిందే . అలా చాలామంది హీరోయిన్స్ చేసే ఈ స్థాయికి వచ్చారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని.. రీసెంట్గా సంచలన కామెంట్స్ చేశాడు యంగ్ హీరో వర్ధన్ పూరి .

ఇతగాడు ఎవరో కాదు 80, 90 విలన్ గా అలరించిన అమ్రీష్ పూరి మనవడే ఈ వర్ధన్ పూరి . 2019లో ‘యే సాలి ఆషీకీ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఇతని పేరును జనాలు గుర్తు పెట్టుకోవడమే మానేశారు . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అన్న ..మంచి అవకాశాలు అందుకోవాలి అన్నా.. అమ్మాయి తరహాలోనే అబ్బాయిలు కూడా కొందరు కోరికలు తీర్చాల్సి ఉంటుందని ..డబ్బులు అడుగుతారు.. కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వమంటారు ..అలా డబ్బులు తీసుకొని కూడా కొన్నిసార్లు మోసపోతారు.. లక్కిలి నేను అలాంటి బాధల నుంచి తప్పించుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు .ఈ క్రమంలోనే యంగ్ హీరో వర్ధన్ పూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!