సింగర్ మంగ్లీ ఓవర్ యాక్షన్.. తిక్క రేగిన కుర్రాళ్లు కోపంతో ఏం చేసారో తెలుసా..?

టాలీవుడ్ లేటెస్ట్ ఫేమస్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ళ దాడి జరిగింది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సింగర్ మంగ్లీ తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ పొలిటికల్ యాంగిల్ లోను టచ్ చేసింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సింగర్ మంగ్లీ పాడిన అన్ని పాటలు బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. సింగర్ మంగ్లీ హీరోయిన్గా కూడా తెరపైకి ఎంట్రీ ఇస్తుంది . పాన్ ఇండియా లెవెల్ లో మొదటి సినిమాను యాక్సెప్ట్ చేసింది సింగర్ మంగ్లీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఇదే క్రమంలో కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు . అక్కడ ఉత్సాహంగా పాటలు పాడి..ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్ల దాడి చేశారు . అంతే కాదు ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ , పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . అయితే మొదటి రోజు వేడుకల్లో భాగంగా సింగర్ మంగ్లీ మిగతా కొంతమంది గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై దాడి చేయడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది . సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసి ఆమెని సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు . మంగ్లీ కొన్ని రోజులు ముందు విక్ బల్లాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నడలో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు .

యాంకర్ బలవంతం మీద రెండు మూడు ముక్కలు మొహమాటంగా కన్నడలో మాట్లాడింది .ఈ క్రమంలోనే కన్నడ ప్రజలు ఆమె పై గుర్రుగా ఉన్నారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని..? ఇంకా కన్నడ భాష తెలియదా ..?కన్నడ అర్థం కాదా..? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి టైం లోనే సింగర్ మంగ్లీ పై రాళ్ల దాడి జరగడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..!!