వావ్: బాలయ్య సినిమాలో బన్నీ బ్యూటీ .. డైరెక్టర్ డేరింగ్ స్టెప్ కి దండం పెట్టాల్సిందే..!!

వావ్ .. ఇది నిజంగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ రికార్డు నెలకొల్పాయి. సినిమా టాక్ అటూ ఇటూ ఉన్నా కానీ నటన పరంగా బాలయ్యను ఏనాడు విమర్శించే స్థాయికి ఆయన నటించలేదు . రీసెంట్గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా నందమూరి బాలయ్య ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడో తెలిసిందే.

ఏకంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీలో సంచలన రికార్డు నెలకొల్పింది . ప్రజెంట్ బాలయ్య – డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్ ఫిక్స్ అయిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు శ్రీ లీల -బాలకృష్ణకు కూతురుగా ఈ సినిమాలో నటిస్తుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు అనిల్ రావిపూడి .

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే – బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . అనిల్ రావిపూడి తో ఇప్పటికే ఉన్న తన ఫ్రెండ్షిప్ కారణంగా పూజా హెగ్డే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ తెలుస్తుంది . మాస్ హీరో బాలయ్య తో హాట్ బ్యూటీ పూజా హెగ్డే జత కడితే కచ్చితంగా ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి బాలయ్య పక్కన పూజ హెగ్డే ఏ రేంజ్ లో స్టెప్స్ వేసి అల్లాడిస్తుందో..?