ఈ యంగ్ హీరోకు అలాంటి సినిమాలే నచ్చుతాయ..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా హీరోల పేరు పొందిన అడవి శేషు మొదట కర్మ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లలో కనిపించారు. ఇక తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక తర్వాత క్షణం సినిమాతో రైటర్ గా హీరోగా సక్సెస్ ని అందుకున్నారు అడవి శేషు. తన ప్రతి సినిమాకు కూడా ఇదే పందాన్ని అనుసరిస్తూ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకున్నారు అడవి శేషు.

Adivi Sesh Calls Major An 'All Indian Film' Hoping To Do Justice To Major  Sandeep Unnikrishnan's Memory

ఇక తర్వాత గూడచారి, ఎవరు, మేజర్ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు రీసెంట్గా హీట్ -2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ గూడాచారి సినిమా సీక్వెల్లో నటించబోతున్నట్లు గడిచిన రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇక ఇటీవలే మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిన అడవి శేషు అదే పందాలో గూడచారి-2 లో కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు ఐదు భాషలలో విడుదల చేయబోతున్నారు.

With 3 films, Adivi Sesh dominates IMDB list of top 25 Telugu movies |  Telugu Movie News - Times of India
ఇక అడవి శేషు ఎప్పుడూ కూడా పోలీస్, గూడచారి, ఏజెంట్ చిత్రాలలో తప్ప నార్మల్ సినిమాలు చేయడం లేదు అనే విషయం ఇప్పుడు అభిమానుల హాట్ టాపిక్ గా మారింది. అయితే అడవి శేషు తన క్యారెక్టర్ లో స్క్రిప్టులకు సరిపోయేటువంటి కథలను ట్రై చేస్తున్నారని .. నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లడానికి అన్ని రకాలుగా పలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ మసాలా సినిమాలు చేయాలని అంటున్నారు ప్రేక్షకులు. మరి అడవి శేషు అభిమానులు కోరిక మేరకు అలాంటి సినిమాల్లో నటిస్తారేమో చూడాలి మరి.