తారక్ ఫ్యాన్ పెద్ద సాహసం.. వారికోసం ఏకంగా ఆ ప్రయత్నం..

ప్రస్తుతం ఫ్యాన్స్ అనగానే ఎవరైన హీరో సినిమా రిలీజ్ అవగానే ఏ ఫేవరెట్ హీరో పోస్టర్స్ పెట్టి పూల దండలు వేయడం, ఆ ఫ్లెక్సీలకు పాలాభిషేకం లాంటివి చేసి వారి ఫేవరెట్ హీరోలపై అభిమానానికి చాటుకుంటారు. అయితే కొంతమంది మాత్రం వారికి ఇష్టమైన హీరో కోసం డబ్బులు వృథా చేయకుండా పేరుతో సేవ కార్యక్రమాలు చేసి ఎదుటివారి కష్టాలని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ జనార్దన్. 50 ఏళ్ళ వయసున్న జనార్దన్ అమెరికాలో ఉంటాడు. జనార్దన్ కి నందమూరి కుటుంబం అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. ఈయన తానా బోర్డ్ అఫ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే జనార్దన్ ఇప్పుడు షోల్డర్ ఆర్ధరైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆయన తన సమస్య ని ఏ మాత్రం లెక్కచేయకుండా కాన్సర్ తో బాధపడేవారికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో, 30 శాతం ఆక్సిజన్ ఉన్నా సహాయపడాలనే ఆయన పట్టుదలతో అంత ఎత్తయిన పర్వతాన్ని కూడా ఎక్కగలిగాడు జనార్దన్. కాన్సర్ రోగులకు నిధులు అందించాలనే లక్ష్యంతో ఆయన ఎలాంటి పెద్ద పర్వతాన్ని అయినా ఎక్కగలిగారు. ఆ పర్వతాన్ని ఎక్కడానికి సుమారు 7 రోజుల సమయం పట్టింది. ఇక తానా, బసవతారకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని జరుపుతున్నట్లు జనార్దన్ తెలిపారు. ఈ సేవ కార్యక్రమానికి ఇప్పటివరకు కోటి రూపాయల విరాళాలు వచ్చాయట.

ఈ డబ్బులతో క్యాన్సర్ రోగుల చికిత్సకు కావాల్సిన పరికరాలను కొంటామని చెప్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఇంకో ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నామని జనార్దన్ తెలుపుతున్నారు. ఇక తరువాత నుంచి కేవలం ఒక హాస్పిటల్ ఏ కాకుండా వివిధ హాస్పిటల్స్‌కి ఫండ్స్ రైజ్‌ చేద్దామని అనుకుంటున్నారట. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాలని భావిస్తున్నారట. వచ్చే ఏడాదిలోగా సుమారు రూ.2 కోట్లు సేకరించి చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీ చేయించాలని ప్లాన్ చేస్తునట్లుగా జనార్దన్ తెలిపారు. ఇక ప్రస్తుతం కాన్సర్ రోగుల గురించి ఇంత రిస్క్ చేసిన జనార్దన్ పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.