సిద్ధార్డ్ -అదితిరావు.. కలిసే ఉన్నారా..?

గడిచిన కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సిద్ధార్థ్-అతిథిరావు హైదరి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ వార్తలు అటు కోలీవుడ్ టాలీవుడ్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం వీరిద్దరూ ఎప్పుడు కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. అలా అని చెప్పి ఈ విషయాన్ని ఖండించలేదు. దీంతో ఈ ఇద్దరి అభిమానులలో పలు సందేహాలకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ జంట తాజాగా శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో కనిపించడంతో మరొకసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

Sharwanand engagement: Rumoured lovebirds Siddharth-Aditi Rao Hydari arrive  in traditional clothes | Celebrities News – India TVనిన్నటి రోజున హైదరాబాదులో నటుడు శర్వానంద్ నిశ్చితార్థ వేడుక రక్షిత రెడ్డి అనే అమ్మాయితో చాలా అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడికి కొంతమంది సినీ ప్రముఖులు సైతం హాజరైనట్లుగా ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి అందులో..సిద్ధార్థ్-అతిథిరావు కలిసి కనిపించారు.దీంతో ఈ విషయం మళ్ళీ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.సిద్ధార్థ్-అతిథిరావు, శర్వానంద్ కలసి మహాసముద్రం చిత్రంలో నటించారు.దీంతో ఇక అప్పటి నుంచి వీరందరూ మంచి స్నేహితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Aditi Rao Hydari and Siddharth attend Sharwanand's engagement as a couple |  Tamil Movie News - Times of India

సిద్ధార్థ్-అతిథిరావు తో గత సంవత్సరం దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసి అందుకు క్యాప్షన్ లో హృదయంలో యువరాణి అంటూ ప్రేమ వ్యాఖ్యాలను జోడించడంతో ఈ విషయం అప్పుడు వైరల్ గా మారింది. మళ్లీ ఇప్పుడు ఇలా కనిపించడంతో సిద్ధార్థ్-అతిథిరావు ఇప్పుడు సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. శర్వా నిశ్చితార్థ వేడుకకు వీరిద్దరూ జంటగా రావడంతో అధికారికంగా చెప్పేసినట్టుగానే తెలుస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శర్వా హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈమె రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest