హీరోయిన్ శృతిహాసన్ పెళ్లికి ప్లాన్ వేస్తోందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో శృతిహాసన్ రేంజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. సీనియర్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం శృతిహాసన్ నటిస్తూ బిజీగా ఉంటోంది. ఒక స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఈమె కెరియర్ మొదటి నుంచి సాధారణ హీరోయిన్గా తన అడుగులు వేసింది.

Shruti Haasan claims boyfriend Santanu Hazarika was 'interested first' but she was the first to say 'I love you'. Watch | Bollywood - Hindustan Times

ఇక తన తండ్రి స్టార్ట్ హీరో అయిన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్టు అయినా శాంతాను హజారికతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇటీవలే డూడుల్ గురించి పదే పదే పోస్టులు పెడుతూ అందరిని ఆకర్షిస్తోంది శృతిహాసన్.. శృతిహాసన్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్ ఈ ఏడాది వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

శృతిహాసన్ శాంతాన వివాహానికి రెండు వైపుల కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో తన కెరీర్ ని కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. దీంతో శృతిహాసన్ హాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వివాహ వేడుకపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

Share post:

Latest