శంకర్ స్కెచ్ మామూలుగా లేదుగా..చరణ్ కోసం ఆ స్టార్ హీరో వచ్చేసాడుగా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటిస్తున్న తాజా మూవీ ఆర్సి15. ఈ సినిమాను సౌత్ ఇండియన్ క్రేజీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్తగా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడట.. అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను శంకర్ పీరియాడిటికల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందట..ఈ క్యారెక్టర్ ద్వారానే చరణ్ పాత్ర కూడా హైలెట్ అవుతుందని తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా అవినీతిపై పోరాడే విప్లవ వీరుడు పాత్ర‌కు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది.

చరణ్' సినిమాలో కన్నడ స్టార్ హీరో ? |

ఇక ఈ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ స్పెషల్ క్యారెక్టర్ సినిమాకి ఎంతో హైలెట్ గా ఉంటుందట. ఇక ఆ పాత్ర చేయడానికి ఉపేంద్ర ఒప్పుకుంటాడో లేదో చూడాలి. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మ‌రి ఈ సినిమాతో చ‌ర‌ణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.