అయ్య బాబోయ్..సమంత అంత టాలెంటెడా… ఏకంగా 50కి 95 మార్కులా..?

గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళలో చాలామంది మొదట్లో ఆవరేజ్ మార్కులతో పాస్ అయిన వారే. తర్వాత వారి గోల్ ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగి అనుకున్న స్థానానికి చేరుకున్నారు. వారిలో మరి కొంతమంది మాత్రం వారి విద్యార్థి దశ నుంచి టాపర్‌గా నిలుస్తూ వారు అనుకున్న స్థానాన్ని దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చిన్నప్పటినుంచి చదువుల్లో టాపర్‌ట. ఈ విషయం సమంత చాలా ఇంటర్వ్యూలో ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పింది. అయితే ఇప్పుడు సమంత పదో తరగతి మార్క్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే విషయాన్ని ఆమె ఆనందంగా రీ ట్విట్ కూడా చేసింది.

సమంత తన చదువు అంతా చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పూర్తి చేసింది. చిన్నతనం నుంచి స్కూల్లో టాపర్‌గా నిలిచిన సమంత. ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇక అయితే ఆ మార్క్ లిస్టులో ఆమె ఇంగ్లీష్ 1 లో 90 మార్కులు మరియు ఇంగ్లీష్ 2 లో 74 మార్కులు వచ్చాయి. గణితంలో 100కి 100 మార్కులు సాధించింది. ఫిజిక్స్‌లో 90 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి.

అలాగే మిగిలిన సబ్జెక్టులో కూడా మంచి మార్కులునే సాధించింది. కానీ జాగ్రత్తగా ఆ మార్క్ లిస్ట్‌ను గమనించినట్లయితే ఆ మార్క్ షీట్ లో ఉన్న చాలా వరకు మార్కులో తప్పుగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ మార్క్ షీట్ లో 50 మార్కులకు జరిగిన ఫిజిక్స్‌లో 95 మార్కులు వేశారు. బోటనీలో 80 మార్కులు సమంతకు ఆమె టీచర్లు ఎందుకు వేసారో ఎలా వేసారో వారికే తెలియాలి..! పోనీ ఇది సమంత క్రేజ్‌ను తగ్గించడానికి ఎవరో రిలీజ్ చేసిన ఫేక్ మార్క్ షీట్ అనుకుందామనుకున్నా.. దానికి ఆస్కారం కూడా లేదు.

ఎందుకంటే సమంత స్వయంగా తన సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేసింది. దీంతో ఇది సమంతకు తెలిసే జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని నెటిజన్స్ ఐడెంటి చేసి 50కి 84 మార్కులు ఎలా వచ్చాయంటూ దానిపై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇదంతా ఆమెకున్న హైప్ పెంచడం కోసం ఆమె పీఆర్ చేస్తున్న నాటకం అంటూ కొందరు నెటిజన్స్ మండి పడుతున్నారు. చైతుతో డైవర్స్ తర్వాత సమస్యల్లో చిక్కుకున్న సమంత కు ఇది మరో సమస్యగా తయారవుతుందా…?!అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న మార్క్ షీట్ జరిగిన ఈ మిస్టేక్ కు సమంత ఎలా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాలి.