ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజ‌మౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిల‌వ‌డంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను ఆస్కార్‌ కి పంపించక పోవడంతో రాజ‌మౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. ఫైన‌ల్ గా `నాటు నాటు` పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్ పొంది చరిత్ర సృష్టించింది. ఆస్కార్‌ అవార్డుకి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజ‌మౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది.

నాటు నాటు పాట ఆస్కార్‌ లో అంత ఈజీగా నామినేట్‌ అవ్వలేదు. దేశం తరపున అధికారికంగా పంపించక పోవడంతో రాజ‌మౌళి అండ్ టీమ్ ఎంతో శ్ర‌మించారు. `ఆర్ఆర్ఆర్‌` ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేసేందుకు భారీగా ఖ‌ర్చు చేశారు కూడా. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం.. ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజ‌మౌళి దాదాపు వంద కోట్లకుపైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి స్క్రీన్స్ లో స్క్రీనింగ్, గెస్ట్ లకు, పీఆర్ ని మెయింటేన్‌ మొదలుకుని ప్రతి విషయంలో కూడా కోట్ల రూపాయలు ఖ‌ర్చు పెట్టారని స‌మాచారం. చాలా మంది మేకర్స్ ఈ క్యాంపెయిన్‌ బడ్జెట్‌ పెట్టలేకనే పోటీ నుంచి తప్పుకుంటారు. కానీ, ఆస్కార్ అందుకుని టాలీవుడ్ ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటిచెప్పేందుకు రాజ‌మౌళి మాత్రం ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డం లేదు.