ఆర్ఆర్ఆర్ కు `గోల్డెన్ టమోటో`.. ఈ అవార్డు ప్ర‌త్యేకత‌ ఏంటి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్‌.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ ను తెస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాను `గోల్డెన్ టమోటా` అవార్డు వ‌రించింది. అస‌లు ఈ అవార్డు ఎక్క‌డ వ‌చ్చింది..? దీన్ని ప్ర‌త్యేక‌త ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. హాలీవుడ్‌లో `రొట్టెన్ టమోటో` అని ఓ వెబ్‌సైట్ ఉంది. సినిమాలను ఏకి పారేయడం ఆ వెబ్‌సైట్ స్టైల్. ఆ వెబ్‌సైట్ ప్రతి ఏడాది మంచి సినిమాలకు ప్రేక్షకులు వేసిన ఓటింగ్ ఆధారంగా అవార్డులు కూడా ఇస్తూ ఉంటుంది.

ఈసారి `గోల్డెన్ టమోటో` మన ఆర్ఆర్ఆర్‌ కు వచ్చింది. ఇక్క‌డ మ‌రో విశేషం అంటే.. ఆస్కార్ బరిలో `ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్` సినిమా ముందంజలో ఉంది. టామ్ క్రూజ్ `టాప్ గన్ : మావెరిక్`కు ఆ త‌ర్వాతి స్థానంలో ఉంది. ఇంకా ఉత్తమ సినిమా కేటగిరీలో `అవతార్ : ద వే ఆఫ్ వాటర్` కూడా ఉంది. అయితే ఆస్కార్ బరిలో ఉన్న ఈ సినిమాలను కాదని `ఆర్ఆర్ఆర్‌`కు ఆడియన్స్ ఓటు వేశారు. గోల్డెన్ టమోటోను అందించారు. దీంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.