ఘ‌నంగా రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం.. సంద‌డి చేసిన ఆర్కే రోజా!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత తో రాకేష్ ఏడడుగులు నడవబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త‌మ ప్రేమ‌ను వీరిద్ద‌రూ బ‌హిరంగంగానే వెల్ల‌డించారు.

అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి పెళ్లికి అంగీకారం తెలిపారు.

ఇక శుక్రవారం రాకేష్ సుజాత నిశ్చితార్థం హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడకకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుత ఏపీ మంత్రి ఆర్కే రోజా హాజరు అయ్యి సందడి చేశారు.

అలాగే యాంకర్ రవి, అనసూయ గెటప్ శీను దంపతులుతో సహా పలువురు బుల్లితెర తారలు, జబర్దస్త్ కమెడియన్స్ రాకేష్ సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు.

ప్రస్తుతం రాకేష్ సుజాత ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, త్వరలోనే ఈ జంట పెళ్లి తేదీని అనౌన్స్ చేయనున్నారు.