రానా తప్పక చేస్తున్నాడా..? తప్పించుకోవడానికి చేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు అంటుంటారు . బహుశా అది రానా దగ్గుబాటి విషయంలో నిజమే అనిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీ లోకి స్టార్ హీరో అవుదామని లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి .. మొదటి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత పలు సినిమాలో నటించినా ఎవరు ఊహించిన విధంగా తన కెరీయర్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టర్న్ చేస్తూ హీరో కన్నా విలన్ గానే ది బెస్ట్ అంటూ కామెంట్స్ దక్కించుకున్నాడు.

ఈ క్రమంలోని రానా దగ్గుబాటికి హీరో కన్నా విలన్ గానే మంచి మంచి స్టోరీస్ పడ్డాయి . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా హిట్ అవ్వడంలో ప్రభాస్ పాత్ర ఏ విధంగా ఉందో రానా పాత్ర కూడా అంతే ఉంది అంటూ జనాలు చెప్పుకొచ్చారు . అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా రానా దగ్గుబాటి విలన్ రోల్ పోషించి సినిమాకి హైలైట్ గా నిలిచారు . ఇంకొంచెం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా రెండు అడుగులు ముందుకేసి సినిమాను హిట్ చేశాడు రానా అంటూ అప్పట్లో జనాలు కామెంట్ చేశారు .

అయితే రానా దగ్గుబాటి ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. దీనికి కారణం ఆయనకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గానే అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న రానా దగ్గుబాటి తన ఆరోగ్యం నిలకడగా లేనందున సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆయన ఆరోగ్యం ఇలాగే కొనసాగితే ఆయన భవిష్యత్తులో కూడా సినిమాలు చేసే అవకాశం లేదు అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు .ఈ క్రమంలోనే రానా దగ్గుబాటి తన హెల్త్ పరంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడా ..? లేక సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ రోల్స్ ఇష్టం లేకనే ఆ పోస్ట్ నుంచి తప్పుకుంటున్నాడా..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది..!!