బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?

ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే దాదాపు బాబు-పవన్ పొత్తు దిశగానే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది..సూపర్ స్టార్ రజినీకాంత్..హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికొచ్చారు. హైదరాబాద్ లో రజినీకాంత్ కొత్త సినిమా జైలర్ షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్..బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు ఎప్పటినుంచో మంచి సన్నిహితులుగా ఉన్నారు.

అయితే వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమి లేదని తెలుస్తోంది. కాకపోతే రజినీ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, బీజేపీ దూతగా ఆయన బాబు వద్దకు వచ్చారని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. అసలు ఆయన రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు..ఒకవేళ బీజేపీ నుంచి రావాలంటే చాలామంది నేతలు ఉన్నారు. కాబట్టి బాబు-రజినీకాంత్ భేటీ కేవలం వ్యక్తిగతం మాత్రమే.

కానీ ఆ మధ్య కన్నడ స్టార్ హీరో యష్‌..నారా లోకేష్ కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ-బాబు భేటీ అయ్యారు. మధ్యలో పవన్-బాబు కలిశారు. ఈ పరిణామాల చూస్తుంటే రాజకీయంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అనే డౌట్ రైజ్ అవుతుంది. మరి చూడాలి ఈ భేటీలు వ్యక్తిగతమా? లేక రాజకీయమా? అనేది రానున్న రోజుల్లో తేలుతుంది.