కొంప ముంచేసిన ఆహా..బాలయ్య- పవన్ ఎపిసోడ్ డిలే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎవరు ఊహించని రీతిలో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని తాజాగా న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్ గా వచ్చిన బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్ కూడా టాక్ షోస్ లోనే దిమ్మతిరిగే వ్యూస్ ను దక్కించుకుంది.

Pawan Kalyan takes part in 'Unstoppable' shoot with Balakrishna

ఈ ఎపిసోడ్ కు కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్‌కు పైగా వ్యూస్ ను తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ కు రెండో భాగమైన బాహుబలి 2 ఎపిసోడ్ కూడా జనవరి 6న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు కూడా పవన్- బాలయ్య ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

గత నెల చివరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తికాగా పవన్- బాలయ్య అప్డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో పవన్- బాలయ్య మధ్య జ‌రిగిన‌ సంభాషణలో బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు వాటికి పవన్‌ ఎలాంటి జవాబు ఇచ్చారు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో అనేది ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు.

తాజాగా ఆహా విడుదల చేసిన జనవరి షెడ్యూల్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లేదు. ఇక దీంతో సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ను బాలయ్య వీర సింహారెడ్డి టీమ్‌తో ప్లాన్ చేయడంతో పవన్ ఎపిసోడ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

అయితే ఇప్పుడు ఆహాలో జయప్రద, జయసుధ, రాశీ ఖన్నా.. ఎపిసోడ్ తో పాటు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన బాహుబలి 1 ఎపిసోడ్ కూడా అందుబాటులో ఉంది. జనవరి 6న బాహుబలి 2 ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా బాలయ్య వీరసింహారెడ్డి టీమ్‌తో స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్- బాలయ్య ఎపిసోడ్ రానుందని దీనిబట్టి తెలుస్తుంది.