ఎన్టీఆర్ అభిమానులకు కాలర్ ఎగరేసుకునే అప్డేట్.. ఎవరు ఊహించని విధంగా వచ్చేస్తున్నాడు గా..!

జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో కొమరం భీముడు గా ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టలేదు.

తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను ఈ వచ్చే నెల ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని అప్డేట్ ఇచ్చారు. వీటితోపాటు ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఇక దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సంవత్సరం కూడా ప్రేక్షకుల ముందుకు రావట్లేదని అర్థమైంది.

దీంతో తన అభిమానులకు ఎన్టీఆర్ 2024లో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ సంవత్సరం ఏకంగా తన రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడట. వచ్చే నెలలో కొరటాల శివ షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే దసరా కానుకగా ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది.

Jr NTR sports fierce look in Prashanth Neel's NTR 31 - India Today

దీంతో 2024 ఏప్రిల్ లో కొరటాల శివ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ లో ప్రశాంత్ నీల్ సినిమాను కూడా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ కూడా తన కెరియర్ పరంగా గ్యాప్ లేకుండా వ‌రుస‌ సినిమాలను ప్లాన్ చేసుకుంటూ అభిమానులకు ఫుల్ అప్డేట్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఎన్టీఆర్ 30వ సినిమాలో కొరటాల తారక్ ను ఏ విధంగా చూపిస్తాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ కామెంట్లు వస్తున్నాయి.

Share post:

Latest