లోకేష్ పాదయాత్రకు ఊహించని కండిషన్స్..సాధ్యమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే అని, వైసీపీకి ఈ కండిషన్స్ వర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదే తరుణంలో ఈ జీవోని కొట్టేయాలని సి‌పి‌ఐ నేత రామకృష్ణ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతుంది..తుది తీర్పు మంగళవారం వస్తుంది.

అయితే ఈ జీవోలో ఉన్న లాజిక్‌లతో లోకేష్ పాదయాత్రకు పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. నిజానికి రాష్ట్ర డి‌జి‌పి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్రమంతా ఒకే కండిషన్ అప్ప్లై అయ్యేది..కానీ లోకేష్ పాదయాత్ర చేస్తున్న ప్రతిసారి..అక్కడ ఉండే సబ్-డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి..ఇలా రాష్ట్రమంతా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే రాష్ట్ర, జాతీయ రహదారులపై పాదయాత్ర చేయవచ్చు..కానీ అది కూడా పావు వంతు రోడ్డులోనే పాదయాత్ర చేయాలి. ఇక రోడ్లపై సభలు నిషేధం..ఖాళీగా ఉన్న ప్రదేశాల్లోనే సభలు నిర్వహించాలి. ఇలా పలురకాల ఆంక్షలతో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

ఒకవేళ జీవో నెం 1ని హైకోర్టు గాని కొట్టేస్తే..ఈ ఆంక్షలు ఉంటాయా? ఉండవా? అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే లోకేష్ జనవరి 26న శ్రీవారిని దర్శించుకుని కుప్పంకు వెళ్లనున్నారు. జనవరి 27న పాదయాత్ర మొదలుకానుంది. ఇలా లోకేష్ పాదయాత్రపై ఆంక్షలు పెట్టడంపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్రకు ఇలాగే ఆంక్షలు పెట్టి ఉంటే పరిస్తితి ఎలా ఉండేది అని, అసలు జగన్ అధికారంలోకి వచ్చేవారు కాదని ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి లోకేష్ పాదయాత్ర విజయవంతంగా నడుస్తుందో లేదో.