బాల‌య్య సినిమాకు కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?

`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహా గార‌పాటి నిర్మిస్తున్నారు.

సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ‌ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంపికైంది. అయితే హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారని గ‌త‌ రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొడుకు పుట్టిన తర్వాత తెలుగులో కాజల్ చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో శ్రీ లీలకు కాజల్ తల్లిగా కనిపించబోతుందని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు కాజల్ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేషన్ తీసుకున్న కాజల్.. ఇప్పుడు బాలయ్య సినిమాకు ఏకంగా రూ. 3.5 కోట్లు చేసిందట. అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాజల్ ఈ రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయడం టాలీవుడ్ లో కొందరు నిర్మాతలను షాక్‌కి గురిచేసింద‌ని అంటున్నారు.

Share post:

Latest