చిన్న హీరోలను చీప్‌గా చూస్తున్న జాన్వీ.. ఆ ప‌ని చేయ‌డంతో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!?

దివంగ‌త‌ నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధ‌డ‌క్‌ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న `ఎన్టీఆర్ 30` లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే `ఆర్సీ16` లోనూ జాన్వీ హీరోయిన్ గా ఎంపిక అయిందని అంటున్నారు. అయితే తాజాగా జాన్వీ వద్దకు టాలీవుడ్ కి చెందిన ఓ చిన్న హీరో సినిమా వెళ్లిందట.

రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా ఆఫర్ చేశారట. కానీ తాను చిన్న హీరోలతో నటించ‌నంటూ జాన్వీ కపూర్ ఆ సినిమాను రిజెక్ట్ చేసిందని తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. చిన్న హీరోలతో సినిమాలు చేస్తే ఆ తర్వాత కూడా చిన్న హీరోల నుండి ఆఫర్లు వస్తాయని జాన్వీ అంటోందట. అయితే ఇలా చిన్న హీరోలను జాన్వీ చీప్ గా చూడటం పట్ల నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీకి అంత బిల్డప్ అక్కర్లేదని ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.