సింహంలా పోరాడుతానంటున్న జగన్..బాబు-పవన్‌కు చెక్?

అధికార వైసీపీ నేతలు జగన్‌ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టి‌డి‌పి నేతలు అదే స్థాయిలో జగన్‌ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు.

ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ ఉంటారు..తాజాగా అదే తరహాలో పొగుడుకున్నట్లు కనిపించారు. చంద్రబాబు-పవన్ పొత్తు దిశగా వెళ్ళడంపై జగన్ కామెంట్ చేశారు.   గతంలో ముసలాయ పాలన చూశామని,  అప్పట్లో బటన్‌లు లేవని, గత ప్రభుత్వంలో గజదొంగలు ఉండేవారని, వీరికి దుష్టచతుష్టయం అని పేరు ఉందని జగన్..చంద్రబాబుని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. తన పాలనలో బటన్‌లు మాత్రమే ఉన్నాయని,  మాట మీద నిలబడే తాను ఒక వైపు..వెన్నుపోట్లు, మోసాలు మరోవైపు అని,  ఈ యుద్ధంలో ఒక్కడినే సింహంలా ముందుకు వెళుతున్నానని, తనకు పొత్తులు లేవని,  మరోవైపు తోడేళ్లు అందరూ ఒక్కటవుతున్నారని,  అయినా, తనకు భయం లేదని, ప్రజలే తనకు తోడు అని జగన్‌ చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు-పవన్ పొత్తుపైనే జగన్ కామెంట్ చేశారు. ఇక ఇక్కడ వారి పొత్తు వల్ల తనకు భయం లేదని చెబుతూనే..తాను ఒంటరిని అని, సొంత మీడియా లేదని ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చి రాజకీయంగా లబ్ది పొందడమే జగన్ స్కెచ్ లా కనిపిస్తుంది.

ఇక సొంత మీడియా, సపోర్ట్ మీడియా జగన్‌కు ఉందో లేదో జనాలకు క్లారిటీ ఉంది. అలాగే పొత్తులు ఎలా ఉన్నా…జగన్ పాలన ఎలా ఉందనేది ప్రజలకు అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు జగన్ వైపు మళ్ళీ నిలుస్తారా? లేదా? అనేది ఎన్నికల సమయంలోనే తేలుతుంది.

Share post:

Latest