ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తన ఉనికి చాటుకుంటుందని ఎక్కువ మంది అంచనా వేశారు. కాకపోతే పలు విభాగాల్లో ఎంపిక అవుతుందని ఆశిస్తే.. ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు మాత్రమే నామినేషన్ దక్కింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ కు నిరాశ తప్పలేదు. ‘నాటు నాటు’ పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డలను కూడా దక్కించుకుంది.
ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డ్కు కచ్చితంగా నామినేట్ అయ్యే అవకాశాలు ఎంతో పుష్కలంగా ఉన్నట్టు కనిపించిన.. ఇండియా మాత్రం ఆస్కార్ అవార్డను చేజేతులా పోగొట్టుకుందని చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ పోటీపడి ఉంటే దానికి ఇప్పటిదాకా వచ్చిన ఇంటర్నేషనల్ ప్రశంసల ప్రకారం చూస్తే కచ్చితంగా ఈ విభాగంలో నామినేషన్ సంపాదించుకోవటమే కాకుండా ఆ అవార్డను కచ్చితంగా సొంతం చేసుకునేదన్నది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విభాగంలో పోటీ కోసం ఎన్నో దేశాల నుంచి ఉత్తమ చిత్రాలను నామినేట్ చేశాయి. మన భారతదేశం నుంచి త్రిబుల్ ఆర్ కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు.. కానీ ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ జ్యూరీ సభ్యులు మాత్రం ఈ సినిమాను కాదని గుజరాత్ నుంచి వచ్చిన ‘చెల్లే షోను’ ఎంపిక చేశారు. కానీ ఈ సినిమా ఇప్పుడు కనీసం నామినేషన్ వరకు కూడా రాలేకపోయింది. ఇక వారు త్రిబుల్ ఆర్ కు బెస్ట్ ఫిలిం అవార్డు దక్కే అవకాశాలు లేవని ముందే వారు తేల్చేశారు.
కానీ మన ఇండియా నుంచి ఈ సినిమా నామినేట్ అయి ఉంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు గట్టి పోటీ ఇచ్చేవారమని.. కచ్చితంగా నామినేషన్ సంపాదించే వాళ్ళమని, చివరిగా విజేతగా నిలవడానికి అవకాశం కూడా ఉందని.. ఇక ఇప్పుడు ఈ సినిమాను నామినేట్ చేయకపోవడం ద్వారా ఇండియా చేజేతులా ఆస్కార్ అవార్డును కోల్పోయిందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది.